Pawan Kalyan On Lulu Mall Conditions : పవన్ కళ్యాణ్ కేబినెట్ లో మాట్లాడిన మాటలు.. ట్వీట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పవన్ అదే కేబినెట్ మీటింగ్ లో లోతైన సంస్కరణ తీసుకొచ్చారు. తన ఆధ్వర్యంలోని పంచాయితీరాజ్ శాఖలో తెచ్చిన సంస్కరణల గురించి ఎవరూ ప్రస్తావించలేదు.
సోషల్ మీడియాలో పవన్ పై వైసీపీ విష ప్రచారం చేస్తోంది. పంచాయితీ రాజ్ సంస్కరణలపై మాత్రం ఎవరూ చర్చించడం లేదు. పట్టించుకోవడం లేదు. పాలనకు వ్యవస్థ చాలా ముఖ్యం. వ్యవస్థలోని లోపాలు సరిదిద్దడానికి పవన్ ప్రయత్నాలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన క్లస్టర్ వ్యవస్థను పవన్ రద్దు చేసి తిరిగి పంచాయతీలకు స్వతంత్రతను తీసుకొచ్చారు. జనాభా, ఆదాయం పరంగా పంచాయతీలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అసలు వారి కోరికలు ఏంటి? ఎందుకు మీలో అసంతృప్తి ఉంది? అని వారి సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.
48 ఏళ్ల తర్వాత పంచాయితీ సెక్రెటరీలకు ప్రమోషన్లు.. పంచాయితీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా గ్రేడ్ మార్పు లాంటి విప్లవాత్మక చర్యలను పవన్ తీసుకున్నారు. పంచాయితీలకు జవసత్వాలను తీసుకొచ్చారు.
ఆంధ్రా క్యాబినెట్ లో అత్యంత ప్రాధాన్యతా అంశం పంచాయితీ సంస్కరణలు, లులూ వివాదం కాదు .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
