Protests in Pakistan: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సున్నితమైన శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉత్సాహంతో స్పందిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఈజిప్ట్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి నేతలు వచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యరు. మోదీని అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. ఇలా ఒకవైపు పాకిస్తాన్ సంబురాల్లో పాల్గొంటుంటే.. ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) దాడిలు కొనసాగిస్తోంది. ఇంకోవైపు ఇమ్రాన్‌ఖాన్ పార్టీ నిరసనలకు దిగుతోంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. చివరకు పాకిస్తాన్‌కు కూడా అర్థం కావడం లేదు.
తెహ్రీకే లబ్బైక్ వాదాల ప్రభావం..
కాల్పుల విరమణ ఒప్పందం జరిగే ఈజిప్ట్‌కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇది పాకిస్తానీలకు నచ్చడం లేదు. ఇక ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రేర్ ఎర్త్ మినరల్స్ పట్టుకుని అమ్మకానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇంతకాలం పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహించిన పాకిస్తాన్.. ఇప్పుడు కాల్పుల విమరణ ఒప్పందానికి మద్దతు ఇవ్వడంపై తెహ్రీకే లబ్బైక్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం ఉదయం 5 గంటలకు నమాజ్ తర్వాత దేశమంతటా ముస్లింలు రోడ్లపైకి వచ్చారు. నిరసన తెలిపారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. ఈ ఘటనలో 300 మంది మరణించారు. 1,900 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తెహ్రీకె లబ్బైక్ పార్టీ నాయకుడు సాద్ రిజ్వీ సోదరుడు అనాస్ రిజ్వీ మరణించాడు. సాద్ రిజ్వీని కూడా సైన్యం టార్గెట్ చేసింది. మూడుసార్లు కాల్పులు జరిపారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.
రేర్ మినరల్స్‌తో విదేశాల్లో తిరుగుతున్న ఆర్మీ చీఫ్..
ఇదిలా ఉంటే.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తమ దేశంలో లభించే రేర్ ఎర్త్ మినరల్స్ గంప నెత్తిన పెట్టుకుని వివిధ దేశాలు తిరుగుతున్నారు. తమ వద్ద లభించే మినరల్స్ కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో అల్లర్లు జరగడంతో సైన్యం, పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
అటు‍్టడుకుతున్న పాక్..
తాజాగా తెహ్రీకే లబ్బైక్ పార్టీ నిరసనలతోపాటు మరోవూపు ఆఫ్ఘాన్-పాక్ సరిహద్దు, భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ 2.0 పరిస్థితులు మరింత ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దేశీయ రాజకీయ విభేదాలు, మతభేదాల దుమారం, ఆర్మీ-ప్రజల మధ్య సంకీర్ణ పరిణామాలు పాక్ ను అభివృద్ధి మార్గం నుండి దూరం చేస్తున్నాయి.
పాకిస్తాన్ సమాజంలో శాంతి ఒప్పందాలు మేలుకొల్పుతున్నప్పటికీ, అంతర్గత విభేదాలు, రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు దేశ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. దేశ నాయకులు అంతర్జాతీయ వేదికలపై శాంతిని గ్లోబల్‌గా ప్రచారం చేస్తారన్నదీ, దేశంలో శాంతి సాధనలో సవాళ్లు ఇంకా ఉంటునా‍్నయి.