J-K Assembly elections : జమ్మూ కాశ్మీర్ లో రెండు దఫాల ఎన్నికలు అయిపోయాయి.. మొత్తం 50 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. 1వ తేదీ మిగతా 40 నియోజకవర్గాలకు జరుగుతాయి. మొత్తం 90 నియోజకవర్గాలు. ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ సరళి చూసినట్టైతే ఓటింగ్ పర్సంటేజీ ఫస్ట్ పేజీలో 61 శాతం.. నిన్న జరిగిన పోలింగ్ లో దాదాపు 57 శాతం పోల్ అయ్యేది. శ్రీనగర్ జిల్లాలో అత్యంత తక్కువ పోలింగ్ నమోదైంది. 30 శాతం లోపే అక్కడ పోలింగ్ అయ్యింది.
2014లో 27 శాతం, 2024లో 24.8 శాతం రాగా.. ఈసారి ఎక్కువగానే వచ్చింది. ఈ శ్రీనగర్ వల్ల ఓవరాల్ శాతం తగ్గింది. అక్కడ పోలింగ్ తగ్గడానికి కారణం ఏంటి? అన్నది కారణాలు తెలుసుకుందాం..
మొత్తం మీద ఈ రెండు ఫేజ్ ల్లో అది వరకు భిన్నంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఉగ్రవాద భయం తగ్గింది. ధైర్యంగా ముందుకు వస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు పట్టున్న జిల్లాల్లో ఓటింగ్ పూర్తయిపోయింది.
జమ్మూలోని ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలిన జమ్మూ, కతువా, సాంబ ప్రాంతాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ బీజేపీకి పట్టు ఉంది. ఇక ఉత్తర కశ్మీర్ కు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. రషీద్ ఇంజినీర్ ఉత్తర కశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లాను ఓడించారు.
ఒమర్ అబ్దుల్లా రాహుల్ గాంధీపై అసహనానికి కారణమేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.