Yogi Adityanath : పరిపాలన అంటే ఉచితాలు పంచడం కాదు.. ఏదోకొన్ని వర్గాలను మచ్చిక చేసుకోవడం కాదు.. ఓటు బ్యాంకు రాజకీయం చేయడం కాదు.. స్తిరమైనటువంటి విధానాలను అవలంభించడమే అసలైన పరిపాలన విధానం.. ప్రజలకు నమ్మకం ఏర్పడాలి.. పరిపాలించే వ్యక్తి సమన్యాయం చేయాలి. పరిపాలకు ప్రథమ లక్షణం ఇదే. మంచి పరిపాలకుడి లక్షణం..
యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన అందరికీ సమాన న్యాయం చేస్తున్నారు. ఆయన రోల్ మోడల్ గా ప్రజలకు నిలుస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ విషయంలో యోగి అవలంభించిన విధానాలు ప్రశంసలు అందుకున్నాయి.
రాష్ట్రాల నిర్వహణలో డిస్కంల పరిపాలన అత్యంత చెత్తగా ఉంది. కేంద్రం ఎన్నో సంస్కరణలు ఇందులో చేస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని రాష్ట్రం యూపీ. అసలు కరెంట్ బిల్లులు కట్టేవారు కాదు.. ప్రభుత్వం అడిగేది కాదు. కానీ ఇప్పుడు యోగి వచ్చాక విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంది.. డిస్కంలు యోగి సంస్కరణలతో స్టిక్ట్ పాలనతో లాభాల్లో నడుస్తున్నాయి.
పాలనా నమూనా ఎలా ఉండాలో చేసి చూపించిన యోగి ఆదిత్యనాథ్ పరిపాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.