Revanth Reddy: కొన్ని కొన్ని అంశాలు రాజకీయ పార్టీలకు బంగారు అవకాశం అయితే.. మరికొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలకు సెల్ఫ్ గోల్ కూడా అవకాశం ఉంటుంది. మూసీ పునరుజ్జీవ పథకం విషయంలో ఇదే జరుగుతోంది. తప్పో ఒప్పో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పథకాన్ని గట్టిగా టేకప్ చేశారు. అంతవరకు ఎవరికీ డౌట్ ఉండాల్సిన పనిలేదు. ఇంతవరకు మన దేశంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చేసి చూపించిన ఒకే ఒక్క నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సబర్మతి రివర్ ఫ్రంట్.
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను మూసీ రివర్ ఫ్రంట్ పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు. దానిని విమర్శించాల్సిన అవసరం లేదు. తను ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఏడాది కూడా కాలేదు కాబట్టి ఆయన చేస్తాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజకీయాలను పక్కన పెడితే.. ఈ పథకంపై రేవంత్ రెడ్డి మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలోని మూసి నది గతంలో లాగా మంచి నీటితో ప్రవహించినట్లు అయితే అందరూ సంతోష పడతారు. ఈ మురికి కూపాల్లో ఉండే బదులు ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రతి ఒక్కరికీ ఉపయోగంగా ఉంటుంది.
ఇంత వరకు ఇలా చేస్తామని చెప్పిన వాళ్లే కానీ చేసిన వాళ్లు లేరు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి వచ్చి నేను చేస్తానని ముందుకు రావడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒక వేళ అలా చేయకపోతే అప్పుడు విమర్శించవచ్చు. ఏదో సందర్భంలో లక్షన్నర కోట్లు అవుతుందని చెప్పిన దాన్ని ప్రతి సారి రిపీట్ చేసి విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తం హైదరాబాద్ నగరం మొత్తాన్ని అభివృద్ధి చేసేందుకు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు మూసీ పునరుజ్జీవ పథకం గురించి డీపీఆర్ ఇంతవరకు తయారు కాలేదు. అప్పుడే ఇలా విమర్శలు చేయడం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.