Munambam : మునంబం.. కేరళలో జరుగుతున్న వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన భూవివాదం ఇదీ.. చెరాయి, మునంబంలలో భూవివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తం కేరళ సమాజాన్ని ఆలోచింపచేస్తోంది. ముఖ్యంగా కేథలిక్ క్రిస్టియన్స్ ను ఆలోచనలో పడేసింది. ఓ చట్టం అన్యాయంగా తమకు తామే న్యాయ నిర్ణేతలుగా డిక్లేర్ చేయడం ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు ఈ ఆలోచన క్రిస్టియన్ సమాజంలో వచ్చింది.
కేరళలోని ఈ ప్రాంతంలో ఎక్కువమంది క్రిస్టియన్లు ఉంటున్నారు. కొత్తగా ఇది ముస్లిం సమాజంలోనూ విభేదాలు తీసుకొచ్చింది.
నవంబర్ 1వ తేదీ.. కోజికోడ్ లో పది ముస్లిం సంస్థలు కూర్చొని తీర్మానం చేశాయి. మునంబం భూవివాదాన్ని బీజేపీ అడ్వంటేజ్ గా తీసుకొని మత సమస్యగా చేయాలని చూస్తోందని.. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని 10 ముస్లిం సంస్థలు తీర్మానం చేశాయి. రెండు వారాలు తిరగకుండానే అదే కోజికూడ్ లో ముస్లిం సంస్థ అధినేత ‘మునంబం వక్ఫ్ భూమి. దాన్ని అమ్మడానికి, కొనడానికి ఎవరీకీ హక్కు లేదని.. ఇది మా వక్ఫ్ భూమి అని.. ఫరూక్ కాలేజీ చీట్ చేస్తోందని.. అమ్ముకోవాలని చూస్తోందని.. ’ సంచలన ఆరోపణలు చేశారు. సున్నీలు, వహాబీలకు తేడా ఉందని ఆరోపించారు.
ముస్లింలీగ్ మాతృ సంస్థ సమస్తలో మునంబంపై విభేదాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.