https://oktelugu.com/

Uttar Pradesh : యూపీ అభివృద్ధికి సూక్ష్మ చిన్న పరిశ్రమలే కీలకంగా మారాయి

మరి ఇంత ప్రగతి ఎలా సాధ్యమైంది.. బీమారు రాష్ట్రం.. వ్యవసాయాధిరిత రాష్ట్రానికి ఇంతటి ప్రగతి ఎలా సాధించింది.. యూపీ అభివృద్ధికి సూక్ష్మ చిన్న పరిశ్రమలే కీలకంగా మారాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2024 / 11:21 AM IST

    యూపీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో జరుగుతోంది. మన ఉపరాష్ట్రపతి వీపీ ధన్కర్ దీన్ని ప్రారంభించారు. 2వేలకు పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి. 70 దేశాల నుంచి 350 విదేశీ స్టాల్స్ రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఉత్పత్తి అయ్యే ఎంఎస్ఎంఈ ప్రాడక్ట్స్ ను ఇందులో ప్రదర్శిస్తున్నారు.

    యూపీలో ప్రదర్శించే ఈ షోలో వియత్నాం కూడా పార్ట్ నర్ కంట్రీగా చేరింది. యూపీ అభివృద్ధిలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల కృషి ఎంతో ఉంది. ఎందుకంటే యూపీలోని ఈ పరిశ్రమల నుంచి ఎగుమతుల వాటా 46 శాతంగా ఉంది. రెండోది మొత్తం దేశంలోని ఎంఎస్ఎంఈల్లోని 14 శాతం యూపీలోనే ఉన్నాయి. 96 లక్షలు ఎంఎస్ఎంఈలు యూపీలో ఉన్నాయి. జీడీపీలో 60 శాతం ఎంఎస్ఎంఈ నుంచే వస్తున్నాయి. 1.6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడింది ఈ రంగంపైనే..

    గత ఐదేళ్లలో దాదాపు 10 శాతం అభివృద్ధి రేటు పెరిగింది. దేశంలో మొత్తం జీఐ ట్యాక్స్ అత్యధికంగా ఉన్నది యూపీలోనే కావడం విశేషం. మరి ఇంత ప్రగతి ఎలా సాధ్యమైంది.. బీమారు రాష్ట్రం.. వ్యవసాయాధిరిత రాష్ట్రానికి ఇంతటి ప్రగతి ఎలా సాధించింది..

    యూపీ అభివృద్ధికి సూక్ష్మ చిన్న పరిశ్రమలే కీలకంగా మారాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.