https://oktelugu.com/

Mohan Charan : ఎప్పటిలాగే వూహకందని వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రిగా మోడీ మార్కు నియామకం

ఎప్పటిలాగే వూహకందని వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రిగా మోడీ మార్కు నియామకంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2024 / 08:02 PM IST

    Mohan Charan : ఒడిశా ముఖ్యమంత్రి ఎవరూ ఊహించని వ్యక్తి అయ్యారు. ఈ వ్యక్తిని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. సింగ్ దేవ్ అయితే ‘పాట్నా కింగ్ డమ్’ వారసుడు ఒడిశా సీఎం అవుతాడని అనుకున్నారు. కానీ ఇంతమంది ఉద్దండులు ఎవరినీ కాదని.. ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ ను ఒడిశా సీఎంగా మోడీ నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    మోహన్ చరణ్.. ఒక అవిశ్రాంత పోరాట యోధుడు.. సామాన్య ప్రజల గుండెచప్పుడు. ఒడిశాలోని టియోన్ జెన్ అనేది ఒక ఆదివాసీ జిల్లా. సంతాల్ అనే తెగకు చెందిన వ్యక్తి మోహన్ చరణ్. ఈయనను ఒడిశా సీఎంగా బీజేపీ నియమించడం సంచలనమైంది.

    ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ అసలు రేసులో లేడు. కనీసం లాబీయింగ్ కూడా చేసుకోలేదు. సీఎంగా ఎంపిక చేసి మోహన్ చరణ్ కు ఫోన్ చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్నారు. ఒక కార్యకర్త కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి దగ్గరి వ్యక్తి మరణించి మార్చురీలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందట.. ఆ పోస్టుమార్టం అయిన తర్వాతనే వచ్చాడట.. హడావుడిగా రాలేదట..

    అంతటి గ్రౌండ్ లెవల్ లో జనానికి కనెక్ట్ అయిన వ్యక్తి మోహన్ చరణ్. అతి సామాన్య జీవితం గడిపే వ్యక్తి. అతడి మంచితనం.. సేవ గురించి కథలు కథలుగా చెబుతారు.

    2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. మోహన్ చరణ్ రాజధాని భువనేశ్వర్ వచ్చారు. ఆయన ప్రభుత్వ క్వార్టర్ ను కేటాయించలేదు. పేద ఎమ్మెల్యే అయిన ఈయన పేమెంట్ రెంట్ మీద ఒక గదిలో నిద్రపోయానని.. సెల్ ఫోన్ పోయిందని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అలాంటి సాధారణ వ్యక్తిని ఒడిశా సీఎంను చేసి బీజేపీ ఎంతో సంచలన నిర్ణయం తీసుకుంది.

    ఎప్పటిలాగే వూహకందని వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రిగా మోడీ మార్కు నియామకంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.