Mohammad Hanifa Jan : లఢక్.. అత్యంత ఎత్తున ఉండే ప్రాంతం. చైనా సరిహద్దును ఆనుకొని ఉంటుంది. లఢక్ లో ఈసారి పార్లమెంట్ ఎన్నిక ఎలా ఉండబోతోంది. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి లఢక్ ను కేంద్రపాలిత ప్రాంతం చేశారు. జమ్మూ కశ్మీర్ కు అసెంబ్లీ ఉంటుంది. లఢక్ కు ఉండదని చెప్పారు.
ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయి. లఢక్ ను యూటీగా చేయాలని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి డిమాండ్ ఉంది. జమ్మూకశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కార్గిల్ లో ముస్లింలు బాగా వచ్చేవారు. అందులో 70 శాతం వరకూ ముస్లింలు ఉండేవారు. కార్గిల్ లో ఉండేవారు సొంత రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. కార్గిల్ లో ముస్లింలు మెజార్టీ, లేహ్ లో బుద్దిస్ట్ లు ఎక్కువగా ఉంటారు. వీరు రాష్ట్రం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కార్గిల్ రాష్ట్రం కావాలంటూ అన్ని పార్టీలు కలిపి కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ ( కేడీఏ) అని ఒక అలయెన్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ పార్టీదే అక్కడ మెజార్టీ గెలిచే అవకాశం ఉంది.
2019లో బీజేపీ అభ్యర్థి జామ్ యాంగ్ నామ్ యాంగ్ గెలిచారు. తక్కువ మార్జిన్ తో గట్టెక్కారు. ఈసారి బీజేపీకి కష్టమేనని అంటున్నారు.
కార్గిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.