Modi-Meloni : మెలోని, మోడీ ‘మెలోడీ’ వెనక ఆంతర్యం తెలుసా?

Modi-Meloni : ఈ కుంభకోణాన్ని వెలికి తీయడానికి మోడీ, మెలోని నిర్ణయించారని తెలిసింది. మెలోని, మోడీ 'మెలోడీ' వెనక ఆంతర్యంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : June 21, 2024 5:11 pm

Agustawestland Scam

Follow us on

Modi-Meloni : ఇటలీ ప్రధాని మెలోని.. భారత ప్రధాని మోడీ ‘మెలోడి’ అద్భుతంగా సాగింది. జీ7 సమావేశాల్లో విశేషం ఏంటంటే.. ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఎంత వైరల్ అయ్యిందంటే.. దాదాపు 3 కోట్ల మంది ట్విట్టర్ లో చూశారు. అంత పాపులర్ అయిన మెలోడి ఫొటో మరొకటి లేదు..

ఒక వైపు పాపులర్ మోడీ.. అంతకన్నా డీప్ మెలోడి ఇద్దరి మధ్య జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. 2013లో అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం ఇటలీలోనే బయటపడింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 వీవీఐపీ భారత్ కొనడానికి అగస్ట్రా వెస్ట్ ల్యాండ్ తో చర్చలు ఒప్పందం జరిగింది. ఆ కంపెనీకే ఈ కాంట్రాక్ట్ రావడం కోసం రూల్స్ మార్చేశారు.ఆ కంపెనీ ఒక్కటే ఎలిజిబిలిటీ అయ్యేట్టు చేశారు. దాదాపు 600 కోట్ల రూపాయలు చేతులు మారాయట.. మొత్తం డీల్ 546 మిలియన్ యూరోలు అయితే అందులో 70 మిలియన్ యూరోలు చేతులు మారాయని సమాచారం. ఎవరెవరి చేతులు మారాయన్నది ఈరోజుకు బ్రహ్మరహస్యంగా మారింది.

2014లో మోడీ వచ్చాక ఈ డీల్ రద్దు చేశారు.. అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ ను అరెస్ట్ చేశారు. దుబాయ్ మధ్యవర్తి మిషెల్ ను భారత్ రప్పించి జైలుకు పంపించారు. ఇవన్నీ కూడా అప్పటి వార్తలు.. అయినా ఈ కుంభకోణం ఈ రోజుకు కొలిక్కి రాలేదు. లబ్ధిదారులు ఎవరన్నది ఈరోజుకు బయటపడలేదు.

ఈ కుంభకోణాన్ని వెలికి తీయడానికి మోడీ, మెలోని నిర్ణయించారని తెలిసింది. మెలోని, మోడీ ‘మెలోడీ’ వెనక ఆంతర్యంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.