Mallikarjun Kharge : మల్లికార్జున ఖర్గే నిన్న ఏఐసీసీ కాంగ్రెస్ భవన్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్పించే సభలో కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకటి ‘మోడీ ఎన్నికల్లో గెలుపు ఓ పెద్ద కుంభకోణం.. ఫ్రాడ్ చేసి మోడీ ఎన్నికల్లో గెలుస్తున్నాడు. ఇది మొట్టమొదటి వ్యాఖ్య. అసలు ఈవీఎంలే పెద్ద బోగస్. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుస్తోంది. ఈసీ జవాబు ఇస్తూనే ఉంది.
మళ్లీ కొత్తగా ఈవీఎం వివాదం ఖర్గే బయటకు తీసుకొచ్చాడు. ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజమే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పాడు. కాబట్టి ఈవీఎంలు ఏమీ కరెక్ట్ కాదు.. ఆల్టర్ చేయడానికి అతీతం కాదు అని పేర్కొన్నాడు.
దీనిపై ఈసీ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంది. కంప్యూటర్లతో లింక్ అయ్యే అవకాశమే లేదని ఈసీ చెబుతోంది. ఏ ఈవీఎంలకు ఆ ఈవీఎంలే.. నెట్ వర్కింగ్ లేదు. వేరేదానితో ఇది కనెక్ట్ కాదు అని ఈసీ చెబుతోంది. ఎలన్ మస్క్ రిఫెర్ చేసే ఈవీఎంలు వేరు.. మనవి వేరు అని ఈసీ చెబుతుంది.
మోడీ గెలుపు ఓ కుంభకోణంగా ఖర్గే వ్యాఖ్య.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.