https://oktelugu.com/

Revanth Reddy : అక్రమ ఆక్రమణల తొలగింపు పై రేవంత్ రెడ్డి చర్యలకి మద్దతిద్దాం

అక్రమ ఆక్రమణల తొలగింపుపై రేవంత్ రెడ్డి చర్యలకి మద్దతిద్దాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2024 / 07:05 PM IST

    Revanth Reddy : హైడ్రా.. అక్రమ ఆక్రమణలపై కొరఢా ఝలిపించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. జులైలో దీన్ని స్థాపించారు. ఏదో ఇదొక నార్మల్ వార్తలాగానే చూశారు. కాంగ్రెస్ కల్చర్ గురించి తెలిసిన వారికి ఇంతలా ఈ సంస్థ విజృంభించి కూల్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇటువంటి మోడల్ లేదు. బుల్డోజర్ తో కూల్చేసే రాజకీయాలు కాంగ్రెస్ వి కావు. ఎప్పుడూ మిలాఖత్ రాజకీయాలు నడిపే కాంగ్రెస్ లో ఇలా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.

    జుల్ 14 నుంచి ఆగస్టు 24 వరకూ వరుస కూల్చివేతలు చూస్తే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందా? అని అనుమానం కలుగుతోంది. రేవంత్ రెడ్డి ఇందులో స్ట్రాంగ్ నిర్ణయం లేకుంటే ఇంత దుందుడుకుగా వెళ్లడు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించక తప్పదు. హైడ్రాకు అంత ధైర్యం ఉండదు. అంత చేసిందంటే అదంతా రేవంత్ రెడ్డి ఇచ్చిన ధైర్యమే.

    ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. హైదరాబాద్ లో వర్షం వస్తే రోడ్ల మీద నీళ్లు ఏరులై పారుతాయి. చెరువులు, నాలాలపై అక్రమ కట్టడాలు కట్టేయడంతో నీటితో హైదరాబాద్ మునుగుతోంది.

    అక్రమ ఆక్రమణల తొలగింపుపై రేవంత్ రెడ్డి చర్యలకి మద్దతిద్దాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం