Kashmir : పాతబస్తీలో కరెంట్ బిల్లులు కట్టడం లేదని చెప్పి.. అదానీ కంపెనీకి బిల్లులు రికవరీ చేసే బాధ్యత అప్పగించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారు. ఒప్పందం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే.. రెవెన్యూ నష్టాలు బాగా వస్తున్నాయని.. పాతబస్తీలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా ఉందట..
నిన్న అసెంబ్లీలో దీనిపై ఎంఐఎం నిరసన తెలిపింది. ఇలా అదానీకి విద్యుత్ బిల్లుల చెల్లింపును మేం ఒప్పుకోమని.. అదానీకి ఇవ్వొద్దని మాట్లాడాడు. అసలు ఏంటి వివాదం.. అని చూస్తే..
పాతబస్తీలో 75 శాతం కంటే ఎక్కువగా విద్యుత్ చౌర్యం జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ లో కూడా కరెంట్ చార్జీలపై ఆందోళన జరుగుతోందట.. అది ఇంకొక కరెంట్ కథలాగా ఉంది. ఈ రెండింటికి లింక్ ఉందా? అని చూస్తే..
కశ్మీర్ లో ఇన్ని సంవత్సరాల నుంచి 75 శాతం మంది ప్రజలకి విద్యుత్ మీటర్లు లేవు. ఫ్లాట్ రేట్లలో కరెంట్ బిల్లులు వసూలు చేస్తారు.ఎప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతోంది. 6 ఏళ్ల క్రితం ఆ ఫ్లాట్ రేట్లను పెంచారు. 24 గంటలూ కరెంట్ ఇవ్వాలని.. కరెంట్ రేట్లను పెంచవద్దని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎవరు ఎంత కరెంట్ వాడుతున్నారో ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశిండచంతో ఈ తేనెతుట్టె కదిలింది.
పాతబస్తీ లో కరెంటు వసూళ్లు ఎలా చేయాలో కాశ్మీర్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకుందాం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.