జమ్మూ కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.. ముమ్మరంగా జరిగాయి. దాదాపు 69 శాతం పోలింగ్ అయ్యింది. విదేశీ రాయబారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. అన్నింటికంటే అదీ విజయం.. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కు 49 సీట్లు, బీజేపీకి 29 సీట్లు, పీడీపీకి 3 సీట్లు, పీపుల్స్ కాంగ్రెస్, అవామీ 1, 7 ఇండిపెండెంట్లు గెలిచారు.
ఎన్నిక ఇంత బ్రహ్మండంగా జరిగి కశ్మీర్ గురించి బాగా చెప్పుకుంటున్న దశలో కుహనా మేధావులు రంగంలోకి దిగారు. ఇది ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని మాట్లాడుతున్నారు. కశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా భావిస్తున్నారట..ఇది పచ్చి అబద్దం..
ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దు మీద ప్రచారమే జరగలేదు. రాష్ట్ర హోదా కావాలని ప్రచారం చేశారు. ఎన్సీతో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీ దీని మీద సైలెంట్ గా ఉంది. రద్దు అయిపోయింది కాబట్టి దాని మీద ప్రస్తావనే లేదు. ఆర్టికల్ 370కి రద్దుకు నిరసనగా ప్రచారం ఎందుకు చేయలేదంటే.. ఎన్సీకి జమ్మూలో ఓట్లు పడదని వారికి తెలుసు. జమ్మూలో నిరసనలు తెలిపారు.
కాశ్మీర్ ఫలితాన్ని ఆర్టికల్ 370తో ముడిపెడుతున్న కుహనా మేధావులు తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.