Kerala Federal Castro Achuthanandan : అచ్చుతానందన్.. జనం అందరూ ఈ ఫైటర్ ను అచ్చుమామ అని పిలుస్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు లీడర్ గా చెబుతుంటారు. పార్టీలకు అతీతంగా ఈయనకు పాపులారిటీ ఉంది. పేదరికం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన స్వశక్తి కలిగిన నేత.. ఎన్నో కమ్యూనిస్టు పోరాటాలు చేశాడు. 1996లో అధికారంలోకి వచ్చే టైంలో పార్టీ ఈయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించింది.కాకపోతే పార్టీ ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం.. అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయనను ఓడించారన్న ప్రచారమైంది.
తర్వాత అచ్చుతానందన్ బలంతో మద్దతుతో ఈకే నాయనర్ సీఎం అయ్యాడు. 5 ఏళ్ల తర్వాత పార్టీ ఓడిపోయి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 2006 అచ్చుతానందన్ సీఎం అవుతాడని.. ఆయనకు అసెంబ్లీ టికెట్ ను పార్టీ ఇవ్వలేదు. ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. గెలిచి కేరళ సీఎం అయ్యాడు.
కేరళ సీఎంగా అచ్యుతానంద్ సీఎం అయినా పార్టీ సహకరించలేదు. పొలిట్ బ్యూరో నుంచి తీసేశారు. పార్టీ లో స్థానం లేకుండా చేశారు. అచ్యుతానందన్ ను కమ్యూనిస్టు పార్టీ తొక్కేసింది. తర్వాత ఎన్నికల్లో 4 సీట్లతో కమ్యూనిస్టు పార్టీ స్వల్ప తేడాతో ఓడిపోయింది.
అత్యంత ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు నాయకుడు అచ్యుతానందన్| పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.