Janasena : స్థిరమైన రాజకీయ పార్టీగా ఎదగాలంటే కేవలం నాయకుడి చరిష్మా మాత్రమే కాక, బలమైన నాయకత్వం, కేడర్ నిర్మాణం, ప్రజలతో గట్టి అనుబంధం ఉండాలి. ఈ లక్ష్యాల దిశగా జనసేన వేస్తున్న అడుగులు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది కావొచ్చు.
జనసేనకు దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టి ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని సాధించిన తర్వాత ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యవస్థను స్థాపించాలనే లక్ష్యంతో పవన్ ముందుకెళుతున్నారు.. అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా పార్టీ విధానాలను రూపొందిస్తున్నారు.
2014లో జనసేన ప్రస్థానం అతికొద్ది మందితో మొదలైంది. 2019 వరకు దాని ఎదుగుదల అంతంత మాత్రమే. 2019లో ఓటమే దాని ఎదుగుదలకు ప్రస్థానంగా మారింది. 2024 లో టీడీపీ పొత్తు నే గేమ్ చేంజర్ గా మారింది. బీజేపీతో కలుపుకొని పోవడం వెనుక సూత్రధారి,పాత్రధారి పవన్ కళ్యాణ్ నే.. జనసేన ఈ స్తాయికి చేరడం వెనుక పవన్ కృషి ఉంది. ఇప్పటం సభ నుంచి మొదలైన పవన్ గేమ్ చేంజర్ వ్యూహం.. తర్వాత టీడీపీతో పొత్తుతో పతాకస్థాయికి చేరింది. టీడీపీతో కలవడంపై మొదట్లో పెదవి విరిచిన వారంతా కూడా పవన్ వ్యూహమే కరెక్ట్ అని అందరూ ఒప్పుకున్నారు.
జనసేన ప్రజల సమస్యలపై ప్రతిపక్షంలో తీవ్రంగా స్పందిస్తూ, విభిన్న సామాజిక వర్గాల మద్దతును పొందేలా కృషి చేసింది. రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళా సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేసింది.. ప్రజలకు దగ్గరగా ఉండేలా నియోజకవర్గ స్థాయిలో జనసేన నాయకత్వాన్ని పటిష్టంగా ఏర్పాటు చేస్తోంది.
శాశ్వత రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.