https://oktelugu.com/

Kashmir Elections : కాశ్మీర్ లో ఎన్నికలు జరిపిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పబోతున్న భారత్

కాశ్మీర్ లో ఎన్నికలు జరిపిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పబోతున్న భారత్.. కశ్మీర్ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2024 / 11:58 AM IST

    Kashmir Elections : సందేహం వీడింది.. కశ్మీర్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు వాయిదా పడుతాయని అందరూ అనుకున్నారు. ఉగ్రవాదులు అడవుల్లో నక్కి దాడులు చేస్తున్నా.. సైనికులు మరణిస్తున్నా.. ఎన్నికలు మాత్రం ఆగవని తేలింది.

    ఉగ్రవాదులకు కశ్మీర్ జనం మద్దతు లేదు. అందుకే అడవుల్లో నక్కి ఈ దాడులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు డెడ్ లైన్ లోపలే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇటీవలే ఎలక్షన్ టీం రాజకీయ పార్టీలు, అధికారులు, స్టేట్ హోల్డర్స్ తో మాట్లాడారు. కేంద్రహోంశాఖతో సెక్యూరిటీపై చర్చలు జరుపుతారు.

    ఉగ్రవాదం కారణంగా ఈసారి ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం లేదు. రేపు 19వ తేదీ వరకూ అమర్ నాథ్ యాత్ర జరుగనుంది. సెంట్రల్ హోం మినిస్టర్ తో చర్చలు ముగిశాక ఎన్నికల కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కశ్మీర్ ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తారు.

    సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలి. మోడీ కూడా కశ్మీర్ వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఓట్ల జాబితా రెడీ అయ్యింది. త్వరలోనే విడుదల చేసి రాజకీయ పార్టీలకు ఇస్తారు.

    కశ్మీర్ లో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి. 47 కశ్మీర్ లో.. 43 జమ్మూలో ఉన్నాయి. 87 లక్షల ఓటర్లు.. 12వేల పోలింగ్ బూతులున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్ ను లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. అత్యంత పారదర్శకంగా ఈ ఎన్నికలు జరుగబోతున్నాయి.

    కాశ్మీర్ లో ఎన్నికలు జరిపిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పబోతున్న భారత్.. కశ్మీర్ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.