https://oktelugu.com/

Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2024 / 06:06 PM IST

    Jammu Kashmir : రేపు మధ్యాహ్నం కల్లా జమ్మూకశ్మీర్ -హర్యానా ఫలితాలు వెల్లడవుతాయి. ఏం జరుగుతుందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఈసారి బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అవే చెబుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ గ్యారెంటీ.. జమ్మూ కశ్మీర్ లో ఏం జరుగబోతోంది. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న అంశం ఇదీ. భారత ప్రభుత్వ విజయం ఏంటంటే.. ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగడం.. ముమ్మరంగా ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడం.. ఇది కశ్మీర్ వ్యతిరేకులు, పాకిస్తాన్ అనుకూలురకు చెంప పెట్టు.

    ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏం జరుగబోతోంది. జమ్మూకశ్మీర్ లో విపరీతంగా బీజేపీ ఖర్చు పెట్టింది. ఆ పద్దతిలో బీజేపీకి సానుకూలత ఉంటుందా? అంటే చెప్పలేం.. కశ్మీర్ లోయలో బీజేపీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. ఎక్కడా గెలిచే అవకాశం లేదు.

    కశ్మీర్ లోయ ప్రజలు అభివృద్ధి జరిగిందని ఒప్పుకున్నారు. కానీ మేం బీజేపీకి ఓటువేయమని ఖరాఖండీగా చెబుతున్నారు. ఈ లాజిక్, రాజకీయాలు ఏంటని చూస్తే.. బీజేపీకి జమ్మూకశ్మీర్ లో ఓట్లు పడుతాయన్నది భ్రమ..

    జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.