Jagan : జగన్ నమ్ముకున్న సామాజిక ఫార్ములా ఫలితమిస్తుందా?

జగన్ నమ్ముకున్న సామాజిక ఫార్ములా ఫలితమిస్తుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 14, 2024 1:21 pm

ఆంధ్ర ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి.. సరిగ్గా ఇంకా నెలరోజుల టైం ఉంది. ఒక విధంగా పోస్ట్ పోన్ కావడం వల్ల 4వ దఫాలో జరగడం వల్ల ఒక రిలీఫ్ వచ్చింది. కావాల్సినంత టైం ఉండడంతో పార్టీలన్నీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులందరినీ ప్రకటించేశారు. జగన్ ముందుగా పూర్తి చేస్తే.. ఎన్డీఏ కూటమి చాలా స్లోగా.. వివాదాల తర్వాత ఆల్ మోస్ట్ పూర్తి చేశారు.

ఏపీలో ఏం మాట్లాడినా పెద్ద వివాదం చేస్తున్నారు. ఎవరికి అనుకూలంగా మాట్లాడినా ఆ పార్టీ మనిషి అని ముద్ర వేస్తున్నారు. ఇంత పొలరైజ్ సమాజం ఏపీలో తప్ప ఎక్కడా లేదు. ఇది సమాజానికి మంచిది కాదు.

ఈ మధ్య వచ్చిన సర్వేలు అన్నీ ఒకలాగానే ఉన్నాయి.ఆంధ్రాలో సర్వేలు టోటల్ డిఫెరెంట్ గా ఉంటున్నాయి. ఇటీవల ఇండియా టుడే-మూడ్ ఆఫ్ ది నేషన్ చూసుకుంటే ఎన్డీఏ వైపు మొగ్గు చూపింది. ప్రశాంత్ కిషోర్ ఓపెన్ గానే జగన్ ఓడిపోతాడు.. టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పాడు. టైమ్స్ నౌ సర్వే చూస్తే జగన్ గెలుస్తాడని అంటున్నారు.

అసలు ఒక సర్వేకు.. మరో సర్వేకు పొంతనలేకుండా ఉంది. అయితే విశ్వసనీయత గల శ్రీఆత్మసాక్షి సర్వే కంటిన్యూస్ గా చేస్తున్నారు. వీరి సర్వేలన్నీ నిజమయ్యాయి. వీరి శాంపిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ తీసిన శ్రీఆత్మసాక్షి సర్వే చూస్తే జగన్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు.కారణాలు పేర్కొన్నారు.

మహిళల్లో టీడీపీ కూటమి కన్నా వైసీపీకి ఎడ్జ్ ఉందని సర్వే తేల్చింది.. గ్రామీణ ఓటర్లు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజికపరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీ వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు అర్బన్, మేల్, ఎడ్యూకేటర్, ఓసీలు మొగ్గు చూపుతున్నారని శ్రీఆత్మసాక్షి సర్వే తెలిపింది..

జగన్ నమ్ముకున్న సామాజిక ఫార్ములా ఫలితమిస్తుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.