Jagan vs Sharmila : వైఎస్ జగన్ ఓ వింతైన క్యారెక్టర్. ఆనోటా ఈనోటా జగన్ గురించి మాట్లాడుకోవడం విన్నాం. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో.. వాళ్ల చెల్లి, తల్లిపై వేసిన కేసు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి లేదు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేసు వేశాడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారని ఎవ్వరూ ఊహించరు.
షర్మిల, విజయమ్మలకు ఎన్సీఆర్టీ ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు పంపింది. దాంతోపాటు జగన్ షర్మిలకు రాసిన లేఖ.. దానికి జవాబు పత్రికలు, మీడియాలో వచ్చిన తర్వాత జగన్ వ్యవహారశైలి వార్తల్లో నిలిచింది. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇంత సంకుచితంగా ఆలోచిస్తాడా? అని అనిపించకమానదు.
షర్మిల విమర్శిస్తుందని ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వననడం ఏమాత్రం సహేతుకం కాదు. షర్మిల ఎన్నో ఏళ్లు అన్నయ్యకు వ్యతిరేకంగా పోకూడదని తెలంగాణలో రాజకీయం చేసింది. విసిగి వేసారే ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కు మద్దతుగా సాక్షిలో చెప్పేవన్నీ అబద్దాలు. అవినాష్ రెడ్డిని కూడా షర్మిల విమర్శించకూడదని జగన్ అనడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
జగన్ క్యారెక్టర్ ఇంతలా డ్యామేజ్ అయ్యాక.. ఆయన అరెస్ట్ అవుతారనే ఇలా నోటీసులు పంపారని ఆయన తరుఫున కుహాన మేధావులు వకల్తా పుచ్చుకొని జగన్ కు డ్యామేజ్ కాకుండా చేస్తున్నారు.
జగన్ ఇంతటి సంకుచిత మనస్కుడని తనకు తానే నిరూపించాడు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.