Bihar: ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ బీహార్ లో సంచలనం సృష్టించబోతోందా?

ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ బీహార్ లో సంచలనం సృష్టించబోతోందా? బీహార్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 20, 2024 8:13 pm

దేశమంతా ఆర్థిక పురోభివృద్ధి కనిపిస్తున్నా బీహార్ లో మాత్రం పేదరికమే తాండవిస్తోంది. ఇప్పటికీ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఎన్నో ఏళ్లుగా బీహార్ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా ఒకనాడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. కానీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వచ్చాక యూపీ ప్రజల తలరాత మారింది. మరి బీహార్ కు ఎన్నాళ్లీ పరిస్థితి.

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఎప్పటి నుంచో సీఎంగా ఉన్నాడు. జంగిల్ రాజా, మాఫియా రాజ్యమేలిన చోట అన్ని సెట్ రైట్ చేశాడు నితీష్. మంచి పాలకుడిగా.. అవినీతి రహితుడిగా.. కుటుంబ పాలనకు వ్యతిరేకిస్తూ మంచిగా పాలించాడు.కానీ అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ముందుకెళుతున్నా.. బీహార్ మాత్రం ఇప్పటికీ వెనుకబడి ఉంది.దేశవ్యాప్తంగా బెగ్గింగ్ బౌల్ గా బీహార్ మారింది.

మరి దీనికి ప్రత్యామ్మాయం లేదా? మోక్షం లేదా? మరి నితీష్ కుమార్ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రత్యామ్మాయం ఎలా ఉంది.? ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు పెద్దగా చదువుకోలేదు. అంత నాలెడ్జ్ పర్సన్ కాదు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? సొంతంగా ఎదగడం లేదు. బీహార్ లో బీజేపీకి నాయకుడే లేడు. పెద్ద లోపంగా ఉంది. చిరాగ్ పాశ్వన్ ను ఎస్సీలే లీడర్ గా చూస్తున్నారు. అందరినీ కలుపుకునే లీడర్ గా కనిపించడం లేదు. ఇంతకన్నా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి అవకాశం ఉండదు. అందుకే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టాడు.

ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ బీహార్ లో సంచలనం సృష్టించబోతోందా? బీహార్ రాజకీయాలపై  ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.