India : GCC..ఇటీవలకాలంలో ఈ పేరు ఎక్కువగా వింటున్నాం..గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్. ప్రపంచసామర్థ్య కేంద్రంగా పేరుగాంచింది. భారత్ లో ప్రతీ రాష్ట్రం వెంటపడి తెచ్చుకుంటోంది. బ్యాక్ ఆఫీసులు అనేవి గతంలో ఉండేవి. అమెరికా లో కంటే భారత్ లో కాస్ట్ చీప్ గా ఉంటుంది. మ్యాన్ పవర్ చవకగా దొరుకుతుంది.
బ్యాక్ ఆఫీస్ లు అందుకే అమెరికా, యూరప్ కంపెనీలు ఇండియాలో పెట్టడానికి చౌక వ్యయమే ఇక్కడ కారణం. బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, అకౌంటింగ్, డేటా ఎంట్రీ, ఐటీ ఉండేవి. ఇవి రానురాను ఇప్పుడు రూపాంతరం చెంది జీసీసీగా మారాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జీసీసీ చేస్తోంది. డేటా అనలటిక్స్, క్లౌండ్ కంప్యూటింగ్, ప్రోడక్ట్ మేనేజ్ మెంట్, పరిశోధనలు సహా ఎన్నో చేస్తున్నాయి. ఆ కంపెనీ అభివృద్ధిలో ఈ జీసీసీ సెంటర్ కీలకంగా ఉంటోంది. జీసీసీ సెంటర్ ల మీదనే కంపెనీలు నడుస్తున్నాయి.
ఇంతటి కీలకమైన ఇండస్ట్రీ భారత్ లో ఎందుకు పెట్టారని ఆలోచిస్తే.. కారణం టాలెంట్ ఉండడమే.. 30 లక్షల మంది గ్రాడ్యూయేట్లు తెలివైన వారు భారత్ లో ఉండడమే. టాలెంట్ ఫూల్ ఉన్న అతిపెద్ద దేశం భారత్ నే. చైనా సాంకేతిక చోరీ, కమ్యూనిస్టు ప్రభుత్వం కఠిన నిర్ణయాలతో భారత్ వైపు కంపెనీలు చూపిస్తున్నాయి.
ప్రపంచ సామర్థ్య కేంద్రంగా (GCC) భారత్ ఎలా ఎదిగింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.