https://oktelugu.com/

Bangladesh : భారత్, హిందూ వ్యతిరేక భావాల్ని నూరిపోస్తున్న బంగ్లాదేశ్ పార్టీలు

మతవాదానికి వ్యతిరేకంగా సెక్యూలర్ భావాలు ప్రోత్సహించే బంగ్లాదేశ్ లోని గాజీ టీవీ అనే బంగ్లాదేశ్ టీవీని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ టీవీ యాంకర్ ఢాకా సరస్సులో శవమై తేలింది. ఈవిడ గాజీ టీవీలో ముఖ్యమైన యాంకర్ గా ఉన్నారు. ఈవిడ మతవాద సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చంపేశారు. బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2024 / 08:33 PM IST

    Bangladesh : బంగ్లాదేశ్ లో పరిణామాలు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి తలదాచుకుంటున్నప్పటి నుంచి మిలటరీ టేకోవర్ చేసింది. నామమాత్రంగా ఒక సివిలియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి మిలటరీ ఆధ్వర్యంలోనే పాలన కొనసాగిస్తోంది. పరిస్థితుల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

    మహ్మద్ యనస్ ప్రధాన సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీలను రాజీనామా చేయిస్తున్నారు. మిలటరీ అధికారులను రాజీనామా చేయిస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు, చంపేస్తున్నారు.

    మతవాదానికి వ్యతిరేకంగా సెక్యూలర్ భావాలు ప్రోత్సహించే బంగ్లాదేశ్ లోని గాజీ టీవీ అనే బంగ్లాదేశ్ టీవీని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ టీవీ యాంకర్ ఢాకా సరస్సులో శవమై తేలింది. ఈవిడ గాజీ టీవీలో ముఖ్యమైన యాంకర్ గా ఉన్నారు. ఈవిడ మతవాద సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చంపేశారు. బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

    మతవాదులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వెళ్లదని.. యూనస్ చక్కదిద్దుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన డమ్మీ అయిపోయి బంగ్లాదేశ్ లో మళ్లీ మతమౌఢ్యం రాజ్యమేలుతోంది. బంగ్లాదేశ్ లో వరదలు వస్తే భారత్ కావాలని నీరు విడుదల చేసి వరదలకు కారణమైందని బంగ్లాదేశ్ లో ప్రచారం చేశారు. శ్రీశైలం డ్యాం గేట్లు విడుదల చేసిన వీడియోను మార్ఫింగ్ చేసి ఫరక్కా డ్యాం గేట్లు ఎత్తినట్టుగా బంగ్లాలో భారత్ పై విషం చిమ్మారు. ఆ వీడియోను వైరల్ చేశారు.

    భారత్, హిందూ వ్యతిరేక భావాల్ని నూరిపోస్తున్న బంగ్లాదేశ్ పార్టీల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.