India Colonial History: చరిత్రను చరిత్రగా చెప్పటానికి మనకు 78 సంవత్సరాలు పట్టింది. అదీ మొత్తం కాదు.. ఇప్పుడే మొదలైంది. ఇటీవల ఎన్సీఆర్టీ 8వ తరగతిలో పాత చరిత్రను మార్చి కొత్త పుస్తకాలు మొదలుపెట్టింది. ఢిల్లీ సుల్తానులు, మొఘల్, విజయనగర సామ్రాజ్యం, మరాఠాలు, సిక్కులు 13-15వ శతాబ్ధం మధ్యలో చరిత్రను తిరిగిరాశారు. ఇదే వివాదమైంది.
మసిపూసి మారేడు కాయ చేసి ఇన్నాళ్లు ముస్లిం రాజులను కీర్తించారు. చరిత్రను చరిత్రగా చెప్పకుండా.. సున్నితత్వాలు ఉన్నాయి కాబట్టి చరిత్రను వక్రీకరించారు. కాపర్, బిపిన్ చంద్ర, ఆర్ఎస్ శర్మ, లాంటి నెహ్రూ మద్దతుగా మేధావులు ముస్లిం రాజులను గొప్ప రాజులుగా కీర్తిస్తూ రాశారు. కానీ నిజం వేరు. వలసవాద చరిత్ర 1757 ప్లాసీ యుద్ధంతో మొదలైంది. బక్సర్ యుద్ధంతో తీవ్రమైంది.
వలసవాద చరిత్రను తెలుసుకోవాలంటే రెండో పరయణ్ యుద్ధంతోనే మొదలైంది. మహ్మద్ ఘోరీ, ఫృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధంలో ఫృథ్వీరాజ్ ఓటమితో వలసవాద చరిత్ర అసలు మొదలైంది. భారత మెయిన్ ల్యాండ్ లో వచ్చింది 1192లో రెండో తరాయిన్ యుద్ధంతో మొదలైంది. ఫృథ్వీరాజ్ ఓటమితోనే ఈ ముస్లిం రాజుల పాలన దేశంలో మొదలైంది. ఈ చరిత్రను ఇప్పుడు పున:లిఖించారు.
భారత్ వలసవాద చరిత్ర 200 సంవత్సరాలు కాదు.. 750 సంవత్సరాలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.