Oxford University : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ ఫర్డ్ యూనియన్ పేరుతో ఓ పెద్ద చర్చ జరిగింది. ‘దిస్ హౌస్ బిలీవ్స్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఆఫ్ కాశ్మీర్’ అన్న దానిపై చర్చించారు. ఈ హౌస్ స్వతంత్ర్య కశ్మీర్ ను నమ్ముతుందని పేర్కొన్నారు. అసలు ఈ కశ్మీర్, పాకిస్తాన్ తో వైరాన్ని సృష్టించిందే ఈ బ్రిటీషర్లు.. ఇప్పుడు భారత్ పవర్ ఫుల్ గా మారేసరికి దాన్ని ఓర్చుకోకుండా మళ్లీ బ్రిటీష్ వారు రగిల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
జే.కేఎల్.ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థల సభ్యులతో యూకే చర్చలు పెట్టడం దారుణంగా చెప్పొచ్చు. వాళ్లు యూకేలోనే ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు. ఎంతో మంది కశ్మీర్ పండింట్లను చంపించిన చరిత్ర ఈ సంస్థ. ప్రొఫెసర్ జఫర్ ఖాన్ అనే పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతిపరుడిని చర్చకు పిలవడం చూస్తే బ్రిటీష్ వారి కుటిల యత్నాలు చూస్తూ ఊరుకునే స్థితిలో ఇండియా లేదు.
కశ్మీర్ కావాలని పాకిస్తాన్ కోరుకోవాలని చిచ్చు పెట్టిందే బ్రిటీష్ వారు. చివరకు బ్రిటీష్ చేసిన చట్టం ప్రకారం కశ్మీర్ మహారాజు ఇండియా వైపు నిలిస్తే పాకిస్తాన్ ను ఎగదోసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఇదే బ్రిటీష్ వారు. గిల్గిట్ బాలిస్తాన్ ను స్వతంత్ర్య దేశంగా ప్రకటించి పాకిస్తాన్ లో కలిపింది బ్రిటీష్ వారే.
ఆక్సఫర్డ్ యూనివర్శిటీ చర్చ పేరుతో కాశ్మీర్ ఉగ్రవాదులకి ఊతం ఇస్తున్న బ్రిటీష్ వారి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.