Baramulla-Ladakh Elections : బారా ముల్లా ఎన్నిక అయిపోయింది. బూతుల్లో ప్రజల నాడి బంధించబడింది. రికార్డ్ స్థాయిలో ఓట్లు పడ్డాయి. దాదాపు గా 60 శాతం ఓట్లు పడ్డాయి. ఇంతవరకూ బారాముల్లలో ఇంతటి పోలింగ్ శాతం నమోదు కాలు. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్. రెండు రోజుల ముందు బీజేపీ ఎక్స్ సర్పంచ్ ను కాల్చి చంపారు. అనంత్ నాగ్ ఇద్దరు టూరిస్టులను కాల్చారు. జనాలను భయభ్రాంతులకు గురిచేయడానికి పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారు.
పోలింగ్ బూత్ వద్దకు వెళితే.. ఓటేస్తే కాల్చి పారేస్తామని హెచ్చరికలను ఉగ్రవాదులు చేశారు. అయినా జనం ఖాతరు చేయలేదు. హ్యాట్సాఫ్ టు బారాముల్ల ప్రజలు అని చెప్పొచ్చు. తిరుగుబాటు తీరుగా ప్రజలంతా ఓటు వేసి పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పారు.
అభ్యర్థులు ఎవరు గెలిచినా కూడా ఇక్కడ ఓటింగ్ లో పాల్గొని భారత్ గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. ఇక లఢక్ లో కూడా 67 శాతం వరకూ పోలింగ్ జరిగింది..
బారాముల్లా, లడఖ్ ఇండిపెండెంటు అభ్యర్థుల హవా? అక్కడ ఎవరు గెలవబోతున్నారు? అక్కడ ఓటింగ్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.