Andhra Pradesh : ఆంధ్రా గతి స్థితి మారుతోంది. 2014లో తెలంగాణ విడిపోయి ఆంధ్రా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత సీనియర్ పొలిటీషియన్ అని నమ్మి చంద్రబాబుకు జనం పట్టకట్టారు. సాధ్యమైనంత వరకూ చంద్రబాబు చేసుకుంటూ వచ్చారు.
ఆంధ్రులకు రాజధాని లేకపోవడం.. రెండోది ఆంధ్రుల చిరకాల స్వప్నం పోలవరం పూర్తి కావడం పెద్ద టాస్కులుగా ఉన్నాయి. ఇవి తీరని కోరికలు. 2014-19 వరకూ చంద్రబాబు చేయాల్సినవి చేశాడు. పోలవరం మొదలుపెట్టినా పూర్తి కాలేదు. ఆ తర్వాత అమరావతి రాజధానికి ఆర్థిక వనరులు లేక.. ప్లానింగ్ పేరిట.. కావాల్సిన డీపీఆర్ లు అంటూ సుధీర్ఘ ప్రక్రియ వల్ల 2019 ఎన్నికలు వచ్చేశాయి. దీంతో అమరావతిలో ఏం కనపడలేదు. విజుబుల్ గా ఏమీ లేకుండా పోయాయి.
దీన్ని జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లాడు. చిలవలు పలవలు చేసి అమరావతి కట్టలేదని ఫోకస్ చేశాడు. అమరావతిని జగన్ చేపట్టకపోవడంతో నగరం పడకేసింది. మూడు రాజధానులు చేసి సంక్షేమం తలకెత్తుకున్నాడు. అదే ఇప్పుడు మైనస్ గా మారింది. 2024లో చంద్రబాబును ఎన్నుకోవడానికి దారితీసింది.
ఈ క్రమంలోనే చంద్రబాబును జైలు కు పంపిన వేళ పవన్ బయటకొచ్చి మద్దతిచ్చి రోడ్డుపై నిరసన తెలిపి కూటమి విజయానికి దారితీసింది.
వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్ర రూపు రేఖలు మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.