Tirupati Laddu row : తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది. ఏం చేయాలనే దానిపై స్పష్టతనిచ్చింది. ఐదుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేశారు. అందులో సీబీఐ నుంచి ఇద్దరు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు.. ఒకరు ఆహార భద్రత అధికారితో కలిసి సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ తేల్చాలని చెప్పారు.
ఒక వినూత్నమైన తీర్పు ఇదీ..అటు సీబీఐని.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపి వేసిన సిట్ ఇదీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది తీసుకునేముందు సొలిసిటరీ జనరల్ అభిప్రాయం అడిగారు. సొలిసిటరీ జనరల్ మాట్లాడుతూ.. ‘ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది నిజమో కాదో అన్నది దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు అభ్యంతరం లేదు కానీ.. పారదర్శకత కోసం కేంద్రంలోని సీబీఐ ని ఇన్ వాల్వ్ చేస్తే బెటర్’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే సుప్రీంకోర్టు తీర్పు రాగానే.. జగన్ బయటకు వచ్చి చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పుకొచ్చాడు. సుప్రీం ఇచ్చిన తీర్పు ఎంతో పారదర్శకంగా చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.