Telangana voting : తెలంగాణ ఓటింగ్ సరళి ఎలా ఉంది.. వార్తల్లో రకరకాలుగా వస్తాయి.. ఈ ఓటింగ్ సరళి గతంతో పోలిస్తే ఎలా ఉంది.. ఈ మార్పులు దేనికి సంకేతమో తెలుసుకుందాం.. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ ఎక్కడా పోలింగ్ జరగలేదు. తెలంగాణలో గతం కన్నా 3 శాతం అధికంగా పోలైంది. దేశానికి భిన్నంగా తెలంగాణలో పోలింగ్ శాతం ఉంది..
2019లో తెలంగాణలో 62.77 శాతం.. 2024 లో 66.30 శాతం వచ్చింది. 3.53 శాతం పెరిగింది. 2014లో తెలంగాణ ఏర్పాటు, అసెంబ్లీ, పార్లమెంట్ ఒకేసారి కావడంతో 70 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. టాప్ 3 చూస్తే భువనగిరి 76 శాతం, ఖమ్మం 76, మెదక్ 75 శాతాలతో టాప్ లో ఉన్నాయి. పోలింగ్ తక్కువ చూస్తే హైదరాబాద్ 48 శాతం, సికింద్రాబాద్ 49, మల్కాజిగిరి 50.07 శాతం పోల్ అయ్యాయి. ఈ మూడు సిటీకి సంబంధించినవి కావడంతో సహజంగా తక్కువగా ఉంటాయి.
తెలంగాణ ఓటింగ్ సరళి నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.