https://oktelugu.com/

BJP election manifesto: కాశ్మీర్ బీజేపీ ఎన్నికల సంకల్ప పత్రం ఎలావుంది?

కాశ్మీర్ బీజేపీ ఎన్నికల సంకల్ప పత్రం ఎలావుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2024 9:21 pm

    ఈనెల 18న మొదటి ఫేజ్ జమ్మూకశ్మీర్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, అమిత్ షా ఒక దఫా ప్రచారాన్ని ముగించాయి. రాహుల్ గాంధీ చాలా వివాదాస్పద ప్రసంగాలు చేశాడు. కశ్మీరీలను రెచ్చగొట్టాడు. మీ హక్కులను ఇతర ప్రాంతాల వారు వచ్చి కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

    ఇక అమిత్ షా ప్రధానంగా ఈసారి వచ్చింది ఎన్నికల సంకల్ప పత్రాన్ని విడుదల చేయడానికి.. ఆ సంకల్ప పత్రం చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. ‘మా సమ్మన్ యోజన’ కింద సంవత్సరానికి 18వేల రూపాయలు ఇంటి పెద్ద మహిళకు.. ఉజ్వల గ్యాస్ యోజన పథకం, పింఛన్ 1000 నుంచి 3 వేలకు.. చదువుకునే స్టూడెంట్స్ కు రూ.3వేలు, కోచింగ్ కు 10వేలు, రిమోట్ స్టూడెంట్స్ కు ల్యాప్ టాప్, టాబ్లెట్,ఆయుష్మాన్ భారత్ 7 లక్షలకు పెంపు, కిసాన్ సమ్మాన్ నిధి మోడీ ప్రభుత్వం 6 వేలతోపాటు ఇంకో 4 వేలు జత చేయడం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం అగ్నివీర్ కోటా, పవర్ వ్యవసాయంలో 50 శాతం సబ్సిడీ.. ఉద్యోగాల కల్పన, కొత్తగా 1000 మెడికల్ సీట్లు, ఇలా చాలా ఎన్నికల హామీలను బీజేపీ గుప్పించింది.

    ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. కాంగ్రెస్ ఆర్థికనమూనాలాగా బీజేపీ నమూనా ఉంది. కశ్మీర్ బడ్జెట్ ను మించి బీజేపీ వరాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    కాశ్మీర్ బీజేపీ ఎన్నికల సంకల్ప పత్రం ఎలావుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    కాశ్మీర్ బీజేపీ ఎన్నికల సంకల్ప పత్రం ఎలావుంది? | How is Kashmir BJP's election manifesto? | Ram Talk