నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలను కలిపి ఒక వ్యాసం రాశారు. వాళ్లు ఏం చేయబోతున్నారు? ఎలా చేయబోతున్నారో ప్రస్తావించారు. ఆ వ్యాసం చదివాక ఏముందంటే.. ‘అమెరికాలో మొట్టమొదటి రిపబ్లిక్ గా గర్వంగా చెప్పుకునే మనం జవాబుదారితనం లేనటువంటి వారిని ప్రభుత్వాన్ని ఎలా నడిపించేలా చేస్తున్నాం. వారు ప్రభుత్వాన్ని నడపకూడదు. వాళ్లు మనమీద ఎక్కి మొత్తం పరిపాలనను నడపడం అంటే.. ఇది రిపబ్లిక్ యొక్క పద్ధతిని ఉల్లంఘించినట్టు.. ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే.. బ్యూరోక్రసీ అనేది రాజ్యాంగం చెప్పిన దానికంటే రెచ్చిపోయి రెగ్యులేషన్స్ తయారు చేస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బ్యూరోక్రసీ తయారు చేసి పాలిస్తోంది.
ఈ బ్యూరోక్రసీ నియంతల పాలనను అరికట్టడం.. కాంగ్రెస్ చట్టాలను, రెగ్యులేషన్స్ లను టచ్ చేయం.. జవాబుదారితనం లేని బ్యూరోక్రాట్స్ ఎలా పరిపాలిస్తారన్నది మస్క్, వివేక్ వాదన.. అనవసరమైనవి తీసేసి.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేస్తామని వీరు ప్రకటించారు.
భారత్ లో పరిపాలనా సంస్కరణలు ఎలా వున్నాయి.. అమెరికా తీరు ఎలా ఉంది అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.