Telangana Politics : తెలంగాణ రాజకీయాలు మూడు ముక్కలాటగా ఉన్నాయి. నెల రోజుల నుంచి ఎన్నికల ముందు ఏ వాతావరణం ఉందో అలాంటి వాతావరణమే ఉంది. రేవంత్ రెడ్డి పదునైన మాటలు.. ప్రతిపక్షాలను, కేటీఆర్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ప్రతిపక్షంలో బీఆర్ఎస్, బీజేపీ కూడా పోటాపోటీ రాజకీయం చేస్తున్నారు.
కేటీఆర్, హరీష్ రావులు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి కూడా పెద్దమనిషిగా రాజకీయం వేడెక్కిస్తున్నారు.
రేవంత్ రెడ్డి సీఎంగా గద్దెనెక్కి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా హైడ్రా, మూసీ రివర్ ప్రాజెక్టులు, స్కిల్ డెవలప్ మెంట్ అంటూ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. దీన్నే ప్రతిపక్షాలు బీజేపీ ‘డైవర్షన్ పాలిటిక్స్ ’ అంటూ ఫోకస్ చేస్తున్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయమని ప్రతిపక్షాలు, అందరూ కోరుతుంటే.. దాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ క్వార్టర్ లో 4వేల కోట్ల రెవెన్యూ ఆదాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగ్గింది. ఉన్న ఆదాయం పడిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో కంటే రాబడి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధును పేరు మార్చినా ఖరీఫ్, రబీలలో రెండు సీజన్లలో ఎగ్గొట్టడం దారుణం. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నది తెలంగాణనే కావడం గమనార్హం.
రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డిల కథనాల్ని జనం ఎలా చూస్తున్నారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.