ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకుంటోంది. టెక్ దిగ్గజాలు, ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ల ఏర్పాటుకు క్యూ కట్టడంతో, మొత్తం పెట్టుబడులు ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ పెట్టుబడుల సునామీకి ఊతం ఇస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ అడుగు వేసింది. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ , డిజిటల్ రియాల్టీ వంటి సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ‘డిజిటల్ కనెక్షన్’ విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యం గల అత్యాధునిక ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ జాయింట్ వెంచర్ సుమారు రూ. 98,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. రిలయన్స్‌తో పాటు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడులు ప్రకటించాయి. దాదాపు రూ. 1.35 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో 1 GW సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్. రూ. 1.10 లక్షల కోట్లతో డేటా సెంటర్ల నిర్మాణం. రూ. 16,000 కోట్ల పెట్టుబడితో 550 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ల కాంప్లెక్స్. సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిఫీతో కలిసి 500 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ (రూ. 15,266 కోట్లు)
మొత్తంగా, రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటా సెంటర్‌ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 3.65 గిగావాట్లకు పైగా ఒప్పందాలు కుదిరాయి. ఈ భారీ పెట్టుబడులతో విశాఖపట్నం రానున్న రోజుల్లో భారతదేశ ‘డేటా రాజధాని’గా అవతరించడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా వైజాగ్ మారనుంది.
ఇవిగో వివరాలు 3 లక్షల కోట్లు దాటిన వైజాగ్ డేటా సెంటర్ల పెట్టుబడులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
