AP Universal Health Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే ఏపి ప్రత్యేక రికార్డు సృష్టించబోతోంది.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు, ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం పరిమిత సహాయం అందిస్తోంది. ఈ రెండు పథకాలను అనుసంధానం చేసి యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పన చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు పొందగలరు.
ప్రస్తుతం 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 3,257 వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. ఇకపై కొత్త పాలసీ కింద అన్ని అర్హులైన కుటుంబాలకు పాతిక లక్షల వరకు ఉచిత వైద్యం లభ్యం కానుంది.
ఈ నిర్ణయం పేదలు, మధ్యతరగతి ప్రజలకు నిజమైన వరంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. ఏపీలో హెల్త్‌కేర్ వ్యవస్థను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే కీలక అడుగుగా ఈ పథకం నిలవనుంది.
ఆంధ్రాలో ఆరోగ్య బీమా అందరికీ వర్తింపు పేదలకు 25లక్షల వరకు.. ఈ పథకంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.