Little Hearts Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. యంగ్ డైరెక్టర్స్ సైతం కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందుకోసమే డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలుగా చేసి సక్సెస్ సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ వారం లిటిల్ హార్ట్స్ అనే ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ చదువుకుంటూ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న ఒక కుర్రాడు(మౌళి) తన చదువుల మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఆయన్ని అట్రాక్ట్ చేసే విషయాలు ఏంటి? ఇంట్లో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడు. సొసైటీ తన మీద ఎలాంటి ముద్ర వేసింది. రిలేషన్స్ తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారు…ఫైనల్ గా వీళ్ళందరికీ చెక్ పెడుతూ మౌళి ఏం చేశాడు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సాయి మార్తాండ్ తను ఏదైతే కథను రాసుకున్నాడో దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా డివిషన్ లేకుండా, ఎక్కడ ఇతర కథలతో ముడి పెట్టకుండా తను అనుకున్న పాయింట్ ను ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల మెంటాలిటి ఎలా ఉంటుంది. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని తెరకెక్కించాడు.
మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన చాలావరకు సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు కానీ, కాలేజీలో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాళ్ళ కంప్లైంట్స్ అవన్నింటిని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు పేరెంట్స్ కి, పిల్లలకి మధ్య ఉండే ఫన్నీ ఇన్సిడెన్స్ వాటన్నింటిని కూడా చాలా బాగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు.
క్లైమాక్స్ లో సినిమాను అమాంతం టాప్ లెవెల్ కి తీసుకెళ్లాడు. పెద్దగా ట్విస్ట్ లు, టర్న్ లు సేమ్ లేకపోయిన కూడా వాళ్ళు అనుకున్న కథను స్టేట్ నేరేషన్ తో చెప్పారు. దానివల్ల సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా చూడగలిగాడు…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. అక్కడక్కడ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా డీసెంట్ గా ఉంది… ఇక షాట్స్ కాంపోజిషన్ లో కూడా ఎక్కడ హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా నీట్ అండ్ స్టడీగా తీశారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన మౌళి చాలా చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. 90స్ బయోపిక్ లో తన నటన అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి అతన్ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఇండస్ట్రీ కి మరో కొత్త హీరో దొరికాడు అంటూ చాలామంది అతన్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు…ఇక హీరోయిన్ గా చేసిన శివాని నగరం సైతం హీరోయిన్ గా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, వాడి మెంటాలిటితో ఆమె నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
రాజీవ్ కనకాల హీరో ఫాదర్ గా మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఉంటారో పెర్ఫెక్ట్ గా చేసి చూపించాడు. ఇక హీరోయిన్ ఫాదర్ గా కాంచీ గారు చాలా బాగా చేశారు. తన భార్యగా సత్య కృష్ణన్ కూడా అదరగొట్టిందనే చెప్పాలి… ఇక హీరో ఫ్రెండ్ గా నటించిన జై కృష్ణ మాత్రం అప్పుడప్పుడు కనిపించిన కూడా కనిపించిన ప్రతిసారి నవ్వులు పూయిస్తూ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు…ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఓకే అనిపించినప్పటికి మ్యూజిక్ కాస్త బాగుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది అనే భావనైతే మనకు కలుగుతోంది. ఇక దర్శకుడు సైతం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్ ఆడ్ స్టడీ గా సినిమాకి ఏ షాట్స్ అయితే కావాలో వాటిని కంపోజ్ చేసుకొని మరీ చేసినట్టుగా అనిపించింది… ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
మౌళి యాక్టింగ్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2.75/5