Revanth Reddy : రెండు రోజులుగా తెలంగాణ మంత్రులు సియోల్ లో పర్యటించారు. నగరాల్లోని నదులు ఎలా ఉన్నాయి? దాని లే అవుట్ ఎలా ఉంది? ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఇది ప్రభుత్వం జరుపుతున్న పీఆర్ ఎక్సర్ సైజులు.. అంత ఖర్చు పెట్టి మంత్రులను అక్కడికి పంపించడం ఏంటి? అతి తక్కువ ఖర్చుతో అహ్మదబాద్ వెళ్లండి.. మోడీ ఎప్పుడో చేసి చూపించాడు. ఎలా చేయవచ్చో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసి చూపించాడు.
సబర్మతి చూపిస్తే మోడీని పొగిడినట్టు అవుతుంది. రాహుల్ వద్ద మైనస్ మార్కులు వస్తాయి.. తక్కువ ఖర్చుతో సబర్మతి చూడకుండా ఎక్కడో ఉన్న సియోల్ వెళ్లడం కరెక్ట్ కాదు. ఇంత ప్రయాస అవసరం లేదు.
జనానికి ఉన్న అనుమానాలు ముందుగా తొలగించాలి. కాంగ్రెస్ గెలుపులో కీలకమైన సూపర్ 6 పథకాలు పక్కనపెట్టారు. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ చేపట్టారు. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఏ సీఎం ఏ రాష్ట్రంలో శాశ్వతం కాదు.. మూసీ ప్రాజెక్ట్ ఈ నాలుగు ఏళ్లలో పూర్తి కాదు.. కాకపోతే రేవంత్ పోస్ట్ ఉంటుందా? పదవిలో లేకపోతే వేరే నేత వచ్చినా.. వేరే పార్టీ అధికారంలోకి వస్తే మూసి పరిస్థితి ఏంటన్నది అందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న.
ముందుగా దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్ లను పరిశుభ్రం చేయండి.. రేవంత్ పాలనా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.