https://oktelugu.com/

Donald Trump : చారిత్రాత్మక ట్రంప్ గెలుపుకు కారణాలు జరగబోయే పరిణామాలు

Donald Trump : చారిత్రాత్మక ట్రంప్ గెలుపుకు కారణాలు జరగబోయే పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2024 / 07:54 PM IST

    Donald Trump : వారం రోజులుగా అమెరికా ఎన్నికలపైనే మీడియా మొత్తం దృష్టి సారించింది. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించాడు. ఏ సర్వే సంస్థ కూడా ఇటువంటి విజయం వస్తుందని చెప్పలేకపోయింది. టైట్ రేస్ అని.. కమలా హ్యారిస్ కు ఆధిక్యం అని సర్వేలు చెప్పుకొచ్చాయి.

    ఎవరూ అంచనా వేయని విధంగా అమెరికాలో ట్రంప్ ఘనవిజయం సాధించాడు. సర్వే సంస్థలన్నీ విఫలమయ్యాయి. ట్రంప్ కు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అంతా వ్యతిరేకంగా పనిచేశాయి. మేధావులు, అన్ని రంగాల వారు, చదువుకున్న వారంతా ట్రంప్ ను వ్యతిరేకించారు.

    ఇదంతా చూస్తే.. ‘ఎకానమీ’ని చూసే అమెరికా ప్రజలు ట్రంప్ కు పట్టం కట్టారు. అమెరికాలో గత నాలుగు నెలల్లో దాదాపు ద్రవ్యోల్బణం పెరగడం.. ఆదాయం పెరగడంతో ఒక్కొక్కరికి 10-13వేల డాలర్ల నష్టం జరిగింది. ఆదాయం పడిపోయింది. ఇమ్మిగ్రేషన్, అబార్షన్లు పనిచేశాయి. ఇల్లీగల్ గా అమెరికాలోకి ప్రవేశాలు కూడా ప్రభావం చూపాయి.

    అమెరికా చరిత్రలో 123 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఒకసారి గెలిచి మళ్లీ ఓడి 3వ సారి గెలిచాడు. పాపులర్ ఓటు ట్రంప్ కే, స్వింగ్ స్టేట్స్ ట్రంప్ కే వచ్చాయి. సెనట్స్ ను కంట్రోల్ లో పెట్టుకునేలా భారీగా గెలిచాడు. అన్ని నియామకాలు ఇప్పుడు ట్రంప్ చేతుల్లోకే వస్తాయి. హౌస్ మెజార్టీ రిపబ్లికన్స్ కే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు కూడా ఒకే పార్టీకి రావడం అనేది పాలన అనుకూలంగా చేసుకోవడానికి తోడ్పడుతుంది.

    డెమోక్రాట్లకు బలం ఉన్న సిటీల్లో ఎక్కువ ఓటింగ్ శాతాన్ని పోల్ చేయలేకపోయారు. అది పెద్ద డ్రాబ్యాక్. నాన్ డిగ్రీ తెల్లజాతీయుల్లో ట్రంప్ కు 9 శాతం పెరిగింది. నాన్ వైట్స్ లలో కూడా ట్రంప్ కు ఓటు వేశారు. నల్లజాతీయులు కూడా ట్రంప్ కే డబుల్ ఓట్లు పడ్డాయి. లాటిన్ అమెరికన్స్ ఓట్ల శాతం 36 నుంచి 41 శాతం ట్రంప్ కే ఓటు వేశారు.

    చారిత్రాత్మక ట్రంప్ గెలుపుకు కారణాలు జరగబోయే పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.