Kannauj: కన్నౌజ్ లో పోయినసారి డింపుల్ యాదవ్ ఓడిపోయింది

కన్నౌజ్ లో పోయినసారి డింపుల్ యాదవ్ ఓడిపోయింది.. ఈసారి ఎవరు గెలుస్తారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 8, 2024 4:24 pm

కన్నౌజ్ లోక్ సభ నియోజకవర్గం ఎలా ఉంది? అక్కడ ఎవరు గెలవబోతున్నారన్నది తెలుసుకుందాం. మే 13న కన్నౌజ్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నిక జరుగబోతోంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు దగ్గరగా ఉన్న ‘కన్నౌజ్’ ఏరియాను యాదవ బెల్ట్ అంటారు.

కన్నౌజ్ లో అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్నాడు. యూపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత. కన్నౌజ్ ప్రాచీన కాలంలో ప్రసిద్ధి చెందిన నగరం. హిందూరాజ్యాలకు ప్రతిష్టాత్మకంగా పేర్కొన్న నగరం ఇదీ. చైనీయులు విజిట్ చేసి బుక్కుల్లో రాశారు.బుద్దిజం, జైనీయులకు పవిత్ర స్థలం. గజినీ దండయాత్ర చేసినప్పుడు మధుర దేవాలయాలు ధ్వంసం చేసి కన్నౌజ్ లో 7 కోటలను, ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేశారు. కన్నౌజ్ ప్రతిష్టాత్మకంగా మారింది. కన్నౌజ్ లో గెలిస్తే హిందూయిజంను దెబ్బతీయవచ్చని అప్పట్లో నమ్మారు.

డా. రాం మనోహర్ లోహియా 1965లో కన్నౌజ్ నుంచే ఎన్నికయ్యారు. జనతా పార్టీ కూడా రెండు సార్లు గెలిచింది. 1990వ దశకం తర్వాత ములాయం సింగ్ యాదవ్ కు కంచుకోటగా మారింది. అఖిలేష్, డింపుల్ యాదవ్ లు 2014 వరుసగా గెలిచారు.

2019లో డింపుల్ పై సుబ్రతా అనే బీజేపీ నేత ఎంపీగా గెలిచి ఈ రికార్డ్ ను బ్రేక్ చేశారు. ఇప్పుడు 2024లో ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.

కన్నౌజ్ నుంచి ములాయం మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ నుంచి ప్రకటించారు. క్యాడర్ వ్యతిరేకించడంతో అఖిలేష్ యాదవ్ స్వయంగా పోటీచేస్తున్నారు. ఇక్కడ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగు బీజేపీ, 1 సమాజ్ వాదీ గెలుచుకుంది.

కన్నౌజ్ లో పోయినసారి డింపుల్ యాదవ్ ఓడిపోయింది.. ఈసారి ఎవరు గెలుస్తారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.