Ram Mandir Pran Pratishtha : అయోధ్య రామాలయ నిర్మాణం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 500 సంవత్సరాల వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. 2020 ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగింది. ఇప్పుడు జూన్ 3-5 మధ్య రామ దర్బార్ కి 7 పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు ప్రాణప్రతిష్ట జరుగబోతోంది.
రామ దర్భార్ అంటే మొదటి అంతస్తులో నిర్మిస్తున్న రాముడి దర్భార్. రాముడు, లక్ష్మణుడు, సీత, భరత, శత్రుజ్ఞ, హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. ప్రాణప్రతిష్ట వీటికి జరుగబోతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో 7 పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. శివుడు, హనుమాన్, గణపతి, సూర్య, భగవతి, అన్నపూర్ణ, శేషానాథ్ లక్ష్మణ్ ఆలయాల కు ప్రాణప్రతిష్ట చేస్తున్నారు. 7 మరిన్ని దేవాలయాలు, మహర్షి వాల్మికి, వశిష్ట , విశ్వామిత్ర, అహల్య, శబరి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
రామాలయ శిఖరానికి బంగారం తాపడం చేస్తున్నారు. 2024 జనవరి 26న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ఈ ప్రాణప్రతిష్టలతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.
3 రోజుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో తుది దశకు అయోధ్య రామాలయ నిర్మాణం. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.