Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి ఊపు తీసుకొచ్చారు. పవన్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. 2014లో పవన్ రాజకీయాల్లోకి వచ్చినా.. 2024 వరకూ పైపైకి వెళ్లలేకపోయాడ. 2024 తర్వాత నుంచి గ్రహణం వీడింది. సూర్యకాంతి ప్రజర్విల్లడం ప్రారంభించింది.
చంద్రబాబును జైల్లో ఉంచిన 2023 నుంచే పవన్ షైనింగ్ మొదలైంది. చంద్రబాబుకు మద్దతుగా స్టాండ్ తీసుకొన్నప్పటి నుంచి పవన్ స్టామినా బయటకు రావడం ప్రారంభమైంది. ఒకే ఒక్కడు ధైర్యంగా నిలబడి పోలీస్ దాష్టీకాన్ని ఎదుర్కొని పోరాటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది పవన్ మేనియా..
2024 ఎన్నికలకు పవన్ ఏకంగా చంద్రబాబుకు లైఫ్ లైన్ అయ్యాడు. మోడీ అధికారంలోకి రావడానికి కీలకంగా మారాడు. అందుకే చంద్రబాబుకు పవన్ అంటే అభిమానం.. మోడీకి అయితే ‘పవన్ అంటే తుఫాన్’ అంటూ పార్లమెంట్ హాల్ లోనే మోడీ పొగిడేశాడు.
తిరుమల లడ్డూ విషయంలో పవన్ సనాతన ధర్మం, ప్రాయశ్చిత దీక్ష ఎఫెక్ట్ తో ఏకంగా దేశంలోనే పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పట్టిన మరాఠా ప్రజలు.. మహారాష్ట్రలో పవన్ ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.