Congress : దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వాటిల్లో ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్. ఎన్నో సార్లు కాంప్రమైజ్ అయినా.. దేశంలో కొన్ని సంఘటనల్లో నిర్లిప్తంగా వ్యవహరించినా.. దేశ చరిత్రలో కాంగ్రెస్ పాత్రను ఎవ్వరూ మరవరు. స్వాతంత్ర్యం తర్వాతకూడా నెహ్రూ మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగారు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా పేరొందాడు. ఇందిరాగాంధీ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా ఆమె స్ట్రాంగ్ బలమైన లీడర్ గా నిలిచారు. రాజీవ్ గాంధీ కూడా ఒక విధంగా జెంటిల్ మెన్. ఆయన రాజకీయ నాయకుడు కాకున్నా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యక్తి.
సోనియాగాంధీ రాజకీయంగా పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన బేసిక్ స్ట్రక్చర్ ను మరిచిపోయింది. భారతీయ మూలాలు వదిలిపెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ భారతీయ మూలాలు వదిలేసింది. రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ అధ: పాతాళానికి చేరింది. ముస్లిం పార్టీగా కాంగ్రెస్ రూపాంతరం చెందింది.
కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వల్ల హిందూ,ముస్లింలకు వేర్వేరు చట్టాల వల్ల ప్రజల్లో ఒక రకమైన చైతన్యం పెరిగింది. కాంగ్రెస్ వల్ల మత రాజకీయం ఎక్కువైందని.. దేశం ముక్కలు కావడానికి కాంగ్రెస్ నే కారణం. అదే విధానాలతో ముందుకు సాగుతుండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింతగా దూరమైపోతోంది.
శాశ్వతంగా ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోనున్న కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.