Telangana Congress : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పిల్లిమొగ్గలు వేస్తోంది. గెలిచామన్నా ధీమానో.. లేక కాంగ్రెస్ కు ఉన్న సహజధోరణినో తెలియదు కానీ.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన గందరగోళంగా ఉంది. అసెంబ్లీకి ఉన్నంత జోరు ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇంతవరకు తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించకపోవడం ఏమిటి? ఇంత దారుణంగా ఉందా? ఇప్పటివరకూ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లలో క్యాండిడేట్లను ప్రకటించకపోవడం చూస్తుంటే ఎంత నిస్సహాయంగా కాంగ్రెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెండోవైపు బీజేపీ దూసుకుపోతోంది. వాళ్ల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. సగం నియోజకవర్గాలను కవర్ చేశారు. కాంగ్రెస్ చూస్తే ఇంకా అభ్యర్థులు కూడా ఎవరో తెలియని పరిస్థితిలో కొన్ని నియోజకవర్గాలున్నాయి.
ఒకవైపు ఇలా ఉంటే.. రెండో వైపు.. ప్రకటించిన అభ్యర్థుల విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లిలో క్యాండిడేట్లపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ అతిపెద్ద సామాజికవర్గమైన మాదిగలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. రెండు మాలలకు ఇచ్చింది. ఒకటి బైండ్ల అనే ఉప కులానికి ఇచ్చింది. ప్రధానమైన మాదిగ సామాజికవర్గాన్ని విస్మరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పిల్లి మొగ్గలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.