https://oktelugu.com/

Congress : పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది తిరిగి పోగొట్టుకున్న కాంగ్రెస్

Congress: దీని వల్ల బీజేపీకి పార్లమెంట్ లో సొంతంగా మెజార్టీ రాలేదు. దీన్ని కాంగ్రెస్ ఊదరగొట్టింది. అది యాక్సిడెంట్ తప్పితే రియాలిటీ కాదని ఈ ఎన్నికలతో నిరూపితమైంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2024 / 08:27 PM IST

    Congress : ఎన్నికల ఫలితాలు, విశ్లేషణలు అన్నీ అయిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు వచ్చేశాయి. స్థూలంగా చెప్పాలంటే.. పార్లమెంట్ కు, రాష్ట్రాలకు జనం నాడి వేరు అని తేలిపోయింది. నాలుగు నెలలకే ప్రజల ఆలోచనాధోరణి మారిపోయింది.

    14 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మినీ జనరల్ ఎలక్షన్స్ గా చెప్పొచ్చు. ముఖ్యమైన రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు, ఇప్పటికీ ఏం మారిందని చూస్తే..

    పార్లమెంట్ లో జరిగింది ఏంటని చూస్తే.. పెద్దరాష్ట్రాలపైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లలో బీజేపీ పెద్ద దెబ్బ తగిలింది. 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీలో కేవలం 36 స్థానాలే బీజేపీ కూటమికి వచ్చాయి. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లకు 17 స్థానాలే బీజేపీకి వచ్చాయి. హిందీ హాట్ ల్యాండ్ రాజస్థాన్ లో 25కి 14 ఎంపీ సీట్లే వచ్చాయి.

    దీని వల్ల బీజేపీకి పార్లమెంట్ లో సొంతంగా మెజార్టీ రాలేదు. దీన్ని కాంగ్రెస్ ఊదరగొట్టింది. అది యాక్సిడెంట్ తప్పితే రియాలిటీ కాదని ఈ ఎన్నికలతో నిరూపితమైంది.

    పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది తిరిగి పోగొట్టుకున్న కాంగ్రెస్ తీరుపై ‘‘రామ్’’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.