https://oktelugu.com/

Abhishek Singhvi : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు భారత రాజకీయాల్ని, వ్యవస్థల్ని శాసిస్తున్నారు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు భారత రాజకీయాల్ని, వ్యవస్థల్ని శాసిస్తున్నారు.. వీరిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2024 / 07:10 PM IST

    Abhishek Singhvi : అభిషేక్ మను సింఘ్వీ.. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్.. రాజ్యసభలో ఎప్పటినుంచో మెంబర్.. అభిషేక్ మను సింఘ్వీ గతసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీఎంసీ మద్దతుతో 2018లో ఎన్నికయ్యారు. టీఎంసీకి, కాంగ్రెస్ కు నాడు తీవ్ర విభేదాలున్నా.. అభిషేక్ కోసం మమతా బెనర్జీ మద్దతు ఇచ్చింది.

    ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో చేరిన కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటులో అభిషేక్ మనుసింఘ్వీని పెట్టి రాజ్యసభకు పంపిస్తున్నారు. వీరికి పార్టీలతో పనిలేదు. రాజ్యసభ సీటు కోసం ఎంతకైనా వెళతారు.

    కపిల్ సిబాల్, చిదంబరంలు కూడా ఇంతే.. ఏదో ఒక పార్టీ తరుఫున రాజ్యసభకు ఎన్నిక అవుతూనే ఉన్నారు. వీళ్లు సుప్రీంకోర్టు లాయర్లు. వీరిని కలవాలంటే కోట్ల రూపాయలు ముట్టచెప్పాల్సిందే. అంత పెద్ద లాయర్లు.

    దేశంలో కరెప్షన్ చార్జులు ఉండి అవినీతితో అరెస్ట్ అవుతున్న ముఖ్యమంత్రులను సుప్రీంకోర్టులో కాపాడుతున్నది కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలే. వీరే వాదిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తరుఫున అభిషేక్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నారు.

    సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు భారత రాజకీయాల్ని, వ్యవస్థల్ని శాసిస్తున్నారు.. వీరిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.