Jammu Kashmir Elections : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నగారా మోగింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఫరుఖ్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, మల్లికార్జున ఖర్గే కలిసి పొత్తును ఖరారు చేశారు. ఈ మూడింట్లో ప్రధాన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ మూడుపార్టీల వల్ల జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ కు ఎడ్జ్ ఉంటుంది. ఇక సీపీఎం కు తుల్గాం అనే దక్షిణ కశ్మీర్ జిల్లాలో లాభం ఉంటుంది.
ఈ మూడు పార్టీలు కలిసి ఒప్పందం చేసుకొని పోటీకి రెడీ అయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వీటికి అధికారం వస్తుందా? అన్నది చూడాలి.
డీ లిమిటేషన్ జరిగిన తర్వాత జమ్మూ 37, కశ్మీర్ కు 46 సీట్లు, ఉండేవి. ఈ రెండు ప్రాంతాల మధ్య 9 సీట్లు తేడా ఉండేవి. కాబట్టి కశ్మీర్ లోయలో ఎవరు గెలిస్తే వారిదే కశ్మీర్ పీఠంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు..
కశ్మీర్ సీట్ల సంఖ్య 47కు మారింది. 37 సీట్లు న్న జమ్మూ ప్రాంతం 43 అసెంబ్లీ స్థానాలకు పెరిగింది. ఇప్పుడు గ్యాప్ 4 సీట్లు మాత్రమే. జమ్మూకు ప్రాధాన్యత పెరిగింది. కొన్ని సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.
కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు ఫలితం ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.