https://oktelugu.com/

Congress : పుల్వామా, ముంబాయి అల్లర్లు, పూంచ్ కాల్పులపై కాంగ్రెస్ నాయకుల నోటిదూల

పుల్వామా, ముంబాయి అల్లర్లు, పూంచ్ కాల్పులపై కాంగ్రెస్ నాయకుల నోటిదూలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 08:24 PM IST

    Congress leaders

    Follow us on

    Congress : కాంగ్రెస్ కు పోయేకాలం దాపురించింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు దారుణంగా ఉంటున్నాయి. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో లెజిస్ట్రేచర్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. ముంబై అల్లర్లు, 26/11 దాడులపై కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. 26/11 దాడుల్లో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ హేమంత్ కర్కరేను కసబ్ చంపలేదని.. ఆర్ఎస్ఎస్ సానుభూత పోలీస్ ఆఫీసర్ చంపాడని దారుణ వ్యాఖ్యలు చేశారు.

    ఇది పాకిస్తాన్ కు మంచి ఆయుధం దొరికింది. భారత్ లోనే శత్రువులు ఉన్నారన్న సంగతి బయటపడింది. ఎవడో రాసుకున్న పుస్తకం చదివి కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి. ఎన్నికల్లో ఇదో ఇష్యూ కింద తీసుకొస్తున్నారు.

    కసబ్ అమాయకుడు.. హేమంత్ కర్కరే ను మీ వాళ్లే చంపారని పాకిస్తాన్ మీడియా కోడై కూసేందుకు అవకాశం కల్పించారు. దేశ భద్రతకు పెనుముప్పు లాంటి ఇలాంటి నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ తీరుపై ఇదొక్కటి చాలు. గోతిలో పాతి పెట్టాలి. ఇంతటి దారుణమైన మాటలు మాట్లాడిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి.

    పుల్వామా, ముంబాయి అల్లర్లు, పూంచ్ కాల్పులపై కాంగ్రెస్ నాయకుల నోటిదూలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.