Telangana Liberation Day: నిన్నటి రోజు తెలంగాణకు అతి ముఖ్యమైన రోజు. తెలంగాణ అస్తిత్వం ముడిపడి ఉన్న రోజు.ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం. తెలంగాణలో కూడా వాడవాడన జరుపుకుంటారు. కానీ సెప్టెంబర్ 17ను జరుపుకోం. ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర్యం జరుపుకుంటుంటే తెలంగాణలో చీకటిలో మగ్గారు. త్రివర్ణ పతాకం ఎగరేస్తే జైలులో వేశారు. ఇది మొత్తం హైదరాబాద్ సంస్థానంలో నిబంధనలు ఉండేవి..
తెలంగాణలోని 8 జిల్లాలు.. మరఠ్వాడాలోని 5 జిల్లాలు.. కర్ణాటకలోని 3 జిల్లాలకు ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు. సెప్టెంబర్ 17న నిజాం పాలనను భారత సైన్యం దించేయడంతో ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చింది.
అయితే దీన్ని తెలంగాణలో విమోచనం.. విలీనం.. ప్రజాపాలన అంటూ వివాదాలను రాజేస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం నలుమూలాల భారత సైన్యం రంగంలోకి దిగి చుట్టుముట్టూ హైదరాబాద్ వరకూ రావడంతో తెలంగాణకు విముక్తి లభించింది. ఇదే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈరోజునే తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలి.
తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోలేమా?.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.