సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో సన్నాయి నొక్కులు నొక్కుతారు. మీన మేషాలు లెక్కపెడుతారు. దేశం మొత్తానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది.
తెలంగాణ ప్రదేశం భారత్ లో ఉంటుందా? పాకిస్తాన్ లో ఉంటుందా? స్వాతంత్ర్యంగా ఉంటుందా? అన్న చిక్కుముడికి సమాధానం దొరికిన రోజు సెప్టెంబర్ 17. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో సహా తెలంగాణ నేతలందరూ ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను జరుపుకోవడం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు వారే తెలంగాణ వచ్చాక గత పదేళ్లలో ఆ ఉత్సవమే జరగలేదు. మరిచిపోయారు. మరిచిపోయినట్టు నరిచారు. కేసీఆర్ అయితే దారుణాతి దారుణం.. నిజాం పాలనను పొగడడమే పనిగా పెట్టుకున్నాడు. మీడియాలో నిజాంను, రజాకర్ల పాత్రను తక్కువ చేసి చూపించాడు. అధికారికంగా జరుపలేదు. దీనిపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోండి.. దీని ప్రాముఖ్యతపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ కింది వీడియోలో చూడండి