Amaravati : రాజధాని అమరావతికి వనరులు సమకూరాయి

Amaravati: అందుకే అప్పట్లో నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంక్ ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం మాత్రం హర్షించదగ్గ పరిణామం.

Written By: NARESH, Updated On : October 22, 2024 7:53 pm

Amaravati : ఇటీవల సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిఆర్డిఏ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల సాయంపై స్పష్టతనిచ్చింది. ఏకంగా వెబ్సైట్లో విషయాన్ని పెట్టింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం అందిస్తున్నామని.. దానికి బాధ్యులుగా భారత ప్రభుత్వాన్ని చూపింది.

అంటే కేంద్రం చెబుతున్న మాదిరిగా ఆ ఆ రుణం తిరిగి చెల్లించే బాధ్యత కూడా కేంద్రానిదే. అదే విషయాన్నిస్పష్టం చేసింది ప్రపంచ బ్యాంక్. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెబుతూ ఏకంగా వెబ్సైట్లో పొందుపరచడం విశేషం. మొత్తానికైతే అమరావతి రాజధానిని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టమైంది. ప్రపంచ బ్యాంకు నిధులతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

అయితే గతంలో సైతం ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు ముందుకు వచ్చింది. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో మూడు వేల కోట్ల రూపాయల సాయం కోసం టిడిపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు అభ్యర్థించింది. ఉత్తర ప్రత్యుత్తరాలు సైతం జరిగాయి. అయితే అప్పట్లో వివిధ రూపాల్లో వైసీపీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు పునరాలోచనలో పడింది. ఇక్కడ అస్తవ్యస్త రాజకీయాలు ఉన్నాయని భావించి రుణ మంజూరుకు ముందుకు రాలేదు. అప్పట్లో కేంద్రంతో టిడిపి ప్రభుత్వం విభేదించడం కూడా ఒక కారణం. అందుకే అప్పట్లో నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంక్ ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం మాత్రం హర్షించదగ్గ పరిణామం.

రాజధాని అమరావతికి వనరులు సమకూరాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.