Budget 2024 for Agriculture : ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి మేలు చేసిందా? లేదా? ఎటువంటి సాయం చేయలేదా? రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ బడ్జెట్ చూస్తే వ్యవసాయ రంగానికి కొత్తగా చేసింది ఏంటని చూస్తే.. ‘పరిశోధన’ మీద కేంద్రీకృతం చేసింది. వ్యవసాయ పరిశోధనలను మొత్తం తిరిగి పున: సమీక్షించి ఎలా కొత్త పరిశోధనలు చేయవచ్చో ప్రణాళికలను ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 32 పంటల కు సంబంధించిన 109 అధిక దిగుబడి విత్తనాలు రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
నేచురల్ ఫామింగ్ ను ఈ బడ్జెట్ ఎంకరేజ్ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులతో ఈ సాగు చేయించాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. 10వేల బయో ఇన్ ఫుట్ రీసెర్చ్ సెంటర్స్ పెట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికీ మనం దేశంలో పప్పులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం.. ఇక దిగుమతి చేసుకుంటున్న పప్పు ధాన్యాలకు విరుగుడుగా ఉత్పత్తి, స్టోరేజ్ కల్పించడం.. మార్కెటింగ్ చేయడం లాంటివి చేయాలని నిర్ణయించారు.
కూరగాయలు, పండ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. దీనికోసం లార్జ్ స్కేలు క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. రైతు ఉత్పత్తి సంఘాలు, కోఆపరేటివ్ సంఘాల ద్వారా సప్లై చైన్ చేయాలని బడ్జెట్ లో సూచించారు.
వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఇంకా ఏమి చేసి వుండాల్సింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.